హన్సికళ | heroine hansika new fashion dress | Sakshi
Sakshi News home page

హన్సికళ

Sep 7 2017 11:59 PM | Updated on Sep 22 2017 12:00 PM

heroine hansika new fashion dress

ఈ పసుపుపచ్చని లెహంగాను జయంతీరెడ్డి జైన్‌ చేశారు.

హన్సిక కళగా ఉంటుంది.
నవ్వుతూ కళకళలాడుతుంటుంది.
హన్సిక ఏ డ్రెస్‌ వేసినా..
ఏ ప్యాటర్న్‌ ఫాలో అయినా..
ఏ కట్‌కి సెలెక్ట్‌ చేసుకున్నా..
వాటన్నిటికీ కళ వచ్చేస్తుంది.
అది ఓ కొత్త కళ... హన్సికళ!


ఈ పసుపుపచ్చని లెహంగాను జయంతీరెడ్డి  జైన్‌ చేశారు. లెహెంగాకి ప్యూర్‌ రా సిల్క్‌ మెటీరియల్‌ని ఉపయోగించారు. దీనిపై జర్దోసీ, గోటాపట్టి వర్క్‌ చేసి ఉన్నాయి. అదే రంగు జాకెట్టు, క్రీమ్‌ కలర్‌ దుపట్టా వాడాం. వేరే ఆభరణాలు వాడకుండా పూర్తి కాంట్రాస్ట్‌ కలర్‌ ఆకుపచ్చ బ్యాంగిల్స్‌ వాడాం. లక్కున్నోడు సినిమాలో ఓ షూట్‌కి ఈ డ్రెస్‌ను సిద్ధం చేశాం.

లాంగ్‌ జాకెట్‌ స్కర్ట్‌ మోడల్‌ వైట్‌ అండ్‌ పింక్‌ కాంబినేషన్‌ డ్రెస్‌ ఇది. ఎస్‌విఎ డిజైన్‌ చేసిన ఈ డ్రెస్‌ ఒక షాప్‌ ఓపెనింగ్‌ సందర్భంలో ధరించారు. లాంగ్‌ జాకెట్‌కి ఫ్రంట్‌ జిప్‌ ఉంటుంది. పూర్తిగా రాసిల్క్‌ మెటీరియల్‌. డే టైమ్‌లో వేసుకోవడానికి ఈ కలర్‌ కాంబినేషన్‌ బాగుంటుంది.

సినిమా ప్రమోషన్‌ కోసం ఎంపిక చేసిన డ్రెస్‌ ఇది. సాక్షా అండ్‌ కిన్ని డిజైనర్‌ స్టోర్‌ నుంచి నేవీ బ్లూ క్రాప్‌టాప్, రా సిల్క్‌ స్కర్ట్‌ తీసుకున్నాం. దీనికి ప్రధాన ఆకర్షణ క్రాప్‌టాప్‌ హ్యాండ్స్‌. ఎంబ్రాయిడరీ చేసిన ఆర్గంజా మెటీరియల్‌ని లాంగ్‌ స్లీవ్స్‌గా ఉపయోగించారు. దీని వల్ల దుపట్టా అవసరం లేకుండా లుక్‌ పూర్తి స్టైలిష్‌గా మారిపోయింది.

ఈ ఫ్రాక్‌ని ప్రెస్‌మీట్‌ సందర్భంలో ఎంపిక చేశాం.  పాయల్‌ప్రతాప్‌ డిజైన్‌ చేసిన ఈ డ్రెస్‌పై పూర్తిగా క్రోషే వర్క్‌ ఉంది. క్యాజువల్‌ అకేషన్స్‌కి యంగస్టర్స్‌కి ఇలాంటి ఫ్రాక్స్‌ బాగా సూటవుతాయి.  

ఎంబ్రాయిడరీ చేసిన స్కర్ట్‌ మీదకు సింగిల్‌ షోల్డర్‌ టాప్‌ని ఎంచుకున్నాం. ఇండియన్‌– వెస్టర్న్‌ టూరిస్ట్‌ కాన్సెప్ట్‌ ఇది. ఒక సినిమా ఆడియో లాంచ్‌కి ఎంచుకున్న ఈ డ్రెస్‌ ఆహుతులను విపరీతంగా ఆకర్షించింది.

మాహి డిజైన్‌ చేసిన అనార్కలీ సూట్‌ ఇది. షిఫాన్‌ అనార్కలీకి పూర్తి గోటా వర్క్‌ చేయడంతో డీసెంట్‌ లుక్‌ వచ్చేసింది. పూజలు, సంప్రదాయ అకేషన్స్‌కి ఈ కలర్‌ కాంబినేషన్‌  బాగుంటుంది.
   
హన్సిక చూడటానికి బొద్దుగా కనిపిస్తారు. ఛాతీ భాగం ఎక్కువ కనిపించకుండా భుజాలు, మెడకు దగ్గరగా ఉండేలా ఆమె డ్రెస్సింగ్‌ ఉంటుంది. ఏ డ్రెస్‌ ధరించినా ఇతర అలంకరణ పెద్దగా  ఉండదు. చాలా సింపుల్‌ మేకప్‌ని ఇష్టపడతారు. ఆభరణాలను ఎక్కువ ధరించరు. దీంతో మరింత అందంగా కనిపిస్తారు.




నటి హన్సికతో నీరజ కోన సినీ తారల డ్రెస్‌ స్టైలిస్ట్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement