హెల్దీఫుడ్ | healthy food | Sakshi
Sakshi News home page

హెల్దీఫుడ్

Nov 24 2016 10:53 PM | Updated on Sep 4 2017 9:01 PM

హెల్దీఫుడ్

హెల్దీఫుడ్

టొమాటోలు - మూడు (పెద్దవి) దోసకాయ

టొమాటో  కాక్‌టెయిల్ కప్స్

కావలసినవి: టొమాటోలు  - మూడు (పెద్దవి) దోసకాయ     - ఒకటి (పై తొక్క తీసి  తురమాలి) గడ్డపెరుగు    - అర కప్పు పచ్చిమిర్చి    - కావలసినంత (సన్నగా తరగాలి )  పనీర్    - 1 టేబుల్ స్పూన్  (సన్నని ముక్కలుగా తరిగినది) ఉప్పు    - రుచికి  తగినంత కొత్తిమీర - తగినంత

తయారి:
1.   టొమాటోని రెండు సమ భాగాలుగా కట్ చేసిపెట్టుకోవాలి.
2.  ఒక పాత్రలో దోసకాయ తురుము, పెరుగు, పచ్చిమిర్చీ, పనీర్ ముక్కలు వేసి కలపాలి.
3.  కట్ చేసిపెట్టుకున్న టొమాటో మధ్యలో  పై మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా అమర్చాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

నోట్: టొమాటోలో ఉండే లైకోపెన్ క్యాన్సర్ కణాలను నియంత్రిస్తుంది. ఫలితంగా క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. పెరుగు, పనీర్‌లో ప్రొటీన్లు సహజంగానే ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సహకరిస్తాయి. ఐరన్ పచ్చిమిర్చి ద్వారా అందుతుంది. ఇన్ని పోషకాలున్న ఈ స్నాక్‌ని రోజూ సాయంకాలం తీసుకోవచ్చు. అన్ని వయసుల వారికీ మేలు జరిగే స్నాక్ ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement