
హెల్దీ డ్రింక్
అరటిపండును పలుచగా ముక్కలు చేసి కనీసం ముప్పావు గంటసేపు ఫ్రీజర్‌లో పెట్టాలి.
బనానా సోయా సూథీ
కావలసినవి: అరటిపండు – ఒకటి; సోయామిల్క్ – అర కప్పు; కోకోపౌడర్ – రెండు టేబుల్ స్పూన్లు; తేనె – ఒక టేబుల్ స్పూన్
తయారి: అరటిపండును పలుచగా ముక్కలు చేసి కనీసం ముప్పావు గంటసేపు ఫ్రీజర్‌లో పెట్టాలి. సోయామిల్క్, కోకోపౌడర్, తేనెలను కలిపి మెత్తగా వచ్చేవరకు బ్లెండ్ చేయాలి. ఇప్పుడు బనానా ముక్కలను వేసి ఒక రౌండ్ తిప్పాలి. దీనిని గ్లాసులో పోసి సర్వ్ చేయాలి. దీనిని పిల్లలు పెద్దవాళ్లు అందరూ తీసుకోవచ్చు. డయాబెటిస్ పేషెంట్లు మాత్రం తీపి లేని కోకోపౌడర్‌ను మాత్రమే వాడాలి. ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గానూ, మధ్యాహ్నం లంచ్ తర్వాత డెజర్ట్‌గానూ తీసుకోవచ్చు. మామూలుగా మనం తీసుకునే ఉపాహారంలో ఉండే శక్తికంటే మెరుగైన ఫలితాన్నిస్తుంది.
పోషకాలు : కేలరీలు – 340; ఫ్యాట్ – 8గ్రా; కార్బోహైడ్రేట్లు – 60గ్రా; ప్రొటీన్‌లు – 17 గ్రా; ఫైబర్ – 10గ్రా; సోడియం – 121 మిల్లీగ్రాములు; పొటాషియం – 749 మిల్లీగ్రాములు
గమనిక: సోయామిల్క్‌కు బదులు ఆవుపాలు లేదా గేదెపాలను వాడవచ్చు. అప్పుడు ఈ పోషకాల పట్టిక వర్తించదు.