హెల్త్ టిప్స్ | health tips | Sakshi
Sakshi News home page

హెల్త్ టిప్స్

Nov 29 2016 11:47 PM | Updated on Sep 4 2017 9:27 PM

హెల్త్ టిప్స్

హెల్త్ టిప్స్

తులసి ఆకులను గ్రైండ్ చేసి ఒక టీ స్పూన్ మిశ్రమంలో అర టీ స్పూన్ తేనె కలిపి రోజుకొకసారి తీసుకోవాలి.

తులసి ఆకులను గ్రైండ్ చేసి ఒక టీ స్పూన్ మిశ్రమంలో అర టీ స్పూన్ తేనె కలిపి రోజుకొకసారి తీసుకోవాలి. ప్రతిరోజూ ఇలా తీసుకుంటుంటే చర్మం నిగారిస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ దరి చేరవు.తులసి రసాన్ని తలకు పట్టించి తలకు టవల్ చుట్టేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేస్తే పేలు పోతాయి. ఇలా వారానికి ఒకసారి వరుసగా ఐదారు వారాలపాటు చేస్తే సమస్య పూర్తిగా పోతుంది.తులసి రసం అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది. ఆకులను గ్రైండ్ చేసి తెల్లటి, నల్లటి మచ్చలున్న చోట రాసి ఆరిన తర్వాత కడగాలి. ఇలా రోజుకు నాలుగు సార్లు చేస్తుంటే రెండు వారాల్లో మచ్చలన్నీ చర్మంలో కలిసి పోతాయి.

అర కప్పు టీ ఆకులు లేదా పొడిని అరలీటరు నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత వడపోసి గాలి దూరని సీసాలో పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. కాలినగాయాలకు, అలసిన కళ్లకు ఇది చక్కటి చికిత్స. దీనిని దూదితో కాని అలాగే కాని చర్మం మీద రాస్తే సరిపోతుంది. ఎండ నుంచి వచ్చిన వెంటనే ఒకసారి చన్నీటితో కడిగి టీ ద్రవాన్ని రాస్తే దేహానికి సాంత్వన చేకూరుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement