ఆరోగ్యానికి హారతి కర్పూరం

Harmed camphor for health - Sakshi

సంప్రదాయం – సైన్స్‌ 

కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారనీ, లడ్టూల వంటి తీపి పదార్థాలకు కాసింత పచ్చకర్పూరాన్ని జత చేస్తే అద్భుతమైన రుచి వస్తుందనీ... అదేవిధంగా వేంకటేశ్వర స్వామి నామాన్ని తీర్చిదిద్దడానికి వాడతారనీనూ. అయితే, కర్పూరం రసాయనాలతో కృత్రిమంగా తయారయిందనుకుంటారు చాలామంది. కానీ, కాంఫర్‌ లారెల్‌ అనే చెట్టు ఆకులు, కొమ్మలనుండి కర్పూరాన్ని తయారు చేస్తారు. అలాగే కొన్నిరకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా తయారు చేస్తారు. 

∙కర్పూరంలో హారతి కర్పూరం, ముద్ద కర్పూరం, పచ్చకర్పూరం, రసకర్పూరం, భీమసేని కర్పూరం, సితాభ్ర కర్పూరం, హిమకర్పూరం తదితర రకాలున్నాయి. దీని వలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. అసలు కర్పూరం వాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్వల్ప గుండె సమస్యలు, అలసట వంటి వాటికి కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
     
అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్‌ నొప్పుల నివారిణిగా, నరాల సమస్యలు, వీపునొప్పికి  బాగా పనిచేస్తుంది. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు  ఉపయోగిస్తారు. ∙శ్వాస సంబంధ సమస్యల నివారణకు వాడే మందుల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు. ∙కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. ∙కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో కర్పూరాన్ని వాడతారు.  ∙జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top