జపనీయులు అన్‌హ్యాపీ!
రోటీ కప్డా ఔర్ మకాన్... ఇవి మూడు ఉంటే భారతీయులు సంతోషంగా ఉంటారని నిన్న మొన్నటి వరకూ అనుకున్నాం. కాని భారతీయులు ఉద్యోగాన్ని కోరుకుంటారని, తమ ఉద్యోగాలను బాగా ప్రేమిస్తారని తాజా సర్వేలో వెల్లడయ్యింది. ఫ్రాన్స్‌కు చెందిన ‘ఇడెన్రెడ్’ అనే కార్పొరెట్ సర్వీసుల సంస్థ 2016 సంవత్సరానికిగాను 15 దేశాలలో ఉద్యోగుల మానసిక సంతృప్తి గురించి 14,000 మందితో ఒక సర్వే నిర్వహించింది. ‘మీరు మీ ఉద్యోగంతో సంతోషంగా ఉన్నారా’ అనే ప్రశ్నకు జవాబు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇచ్చింది. అన్ని దేశాల కంటే భారతీయులే నూటికి 88 శాతం మంది సంతోషంగా ఉన్నట్టు జవాబు ఇచ్చారు.
ఒత్తిడి కలిగించే సోమవారాలు, పీడించే బాస్‌లు, ఇబ్బంది పెట్టే పని వాతావరణం ఇవన్నీ ఎలా ఉన్నా చేస్తున్న ఉద్యోగంలో సంతోషం వెతుక్కోవడం ముఖ్యంగా చేస్తున్న ఉద్యోగంతో భావోద్వేగపరమైన సంతృప్తి వెతుక్కోవడం చేస్తున్నారని ఈ ఫలితాలు చెబుతున్నాయి. పనితో సంతోషంగా ఉన్న ఆ తర్వాతి దేశాలలో మెక్సికో, అమెరికా, చిలీ దేశాలు ఉన్నాయి. అయితే శ్రమకు విలువిచ్చే దేశంగా భావించే జపాన్‌లోని ఉద్యోగులు మాత్రం చాలా నిస్పృహగా ఉన్నారు. నూటికి 44 శాతం మంది మాత్రమే తాము తమ ఉద్యోగాలతో సంతోషంగా ఉన్నామని చెప్పారు. అయితే తాము సంతృప్తిగా పని చేయాలంటే ‘మంచి పని వాతారణం’ ఉండాలని కోరుకుంటున్న దేశాలలో జపాన్, టర్కీ, చైనా, ఇటలీలు ఉన్నాయి.
తాము చేస్తున్న పనికి ‘మంచి గుర్తింపు ప్రోత్సాహం’ ఉండటం ప్రధానమని జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం అన్నాయి. సర్వేలో పాల్గొన్న చాలామంది ఉద్యోగ విరమణ తర్వాత దొరికే లబ్ధి గురించి శ్రద్ధ పెట్టాలని కోరారు. అలాగే ఎక్కువ మంది ఎప్పటికప్పుడు పనిలో నైపుణ్యాలు పెంచుకునే ట్రైనింగ్ ఇస్తూ పురోభివృద్ధి సాధించే వీలును సంస్థలు కల్పించాలని కోరారు. రిపోర్ట్
ఉద్యోగాల్లో భారతీయులు హ్యాపీ...
Published Thu, Jun 2 2016 11:45 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement