ముఖ కాంతికి పెరుగు, క్యారెట్‌

Good Face Packs Can Be Made At Home - Sakshi

బ్యూటిప్స్‌

సౌందర్య ఉత్పత్తులలో రసాయనాలు, రోజువారీ జీవనశైలిలో ఎదుర్కొనే కాలుష్యం వల్ల ముఖ కాంతి తగ్గుతుంది. సహజమైన మెరుపుతో పాటు ముఖానికి నునుపుదనాన్ని తీసుకువచ్చే మేలైన ఫేస్‌ ప్యాక్స్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

►కొబ్బరినూనె, తేనె కలిపి ముఖానికి మసాజ్‌ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పొడి చర్మం గలవారు రోజూ రాత్రి పడుకునేముందు ఈ విధంగా చేస్తుంటే చర్మం మృదువు, కాంతిమంతంగా తయారవుతుంది.

►రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్‌ పెరుగు, టీ స్పూన్‌ కీరా రసం కలిపి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్‌ ఏర్పడిన చర్మానికి సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది ఈ ప్యాక్‌.

►టీ స్పూన్‌ గోధుమపిండిలో పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి వేళ్లతో మృదువుగా రుద్దాలి.æపాలు చర్మానికి బాగా ఇంకాయనిపించాక చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం కోల్పోయిన చర్మానికి ఈ ప్యాక్‌ వల్ల మంచి కాంతి లభిస్తుంది.

►రెండు టీ స్పూన్ల క్యారెట్‌ రసంలో టీ స్పూన్‌ తేనె, రెండు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి ముఖానికి పట్టించాలి. మృదువుగా రబ్‌ చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది.

►రెండు టేబుల్‌స్పూన్ల టొమాటో జ్యూస్, టేబుల్‌ స్పూన్‌ ఓట్స్‌ అరకప్పు పెరుగులో కలపాలి. మిశ్రమం గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గి చర్మం మెరుపు పెరుగుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top