సోయాబీన్స్‌తో సొగసు... | Fineness with soybeans | Sakshi
Sakshi News home page

సోయాబీన్స్‌తో సొగసు...

May 18 2015 11:39 PM | Updated on Sep 3 2017 2:17 AM

సోయాబీన్స్‌తో సొగసు...

సోయాబీన్స్‌తో సొగసు...

ఎండ వల్ల చర్మం కమలడం, పొడిబారడం వంటి సమస్యలకు సోయా బీన్స్‌లో ఉండే....

 బ్యూటిప్స్
 
ఎండ వల్ల చర్మం కమలడం, పొడిబారడం వంటి సమస్యలకు సోయా బీన్స్‌లో ఉండే ఐసో ఫ్లేవన్ అనే పదార్థం విరుగుడుగా పనిచేస్తుంది.
50 గ్రాముల సోయా బీన్స్ తీసుకొని, నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి.మరుసటి రోజు ఉదయం, నానిన సోయాబీన్స్‌ను మెత్తగా రుబ్బాలి.

కొద్దిగా పచ్చిపాలు, బాదం నూనెను రుబ్బిన సోయాబీన్స్ మిశ్రమం కలిపి, పేస్ట్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.ఈ ప్యాక్ రోజూ వేసుకోవచ్చు. ముడతలు తగ్గుతాయి. చర్మకాంతి పెరుగుతుంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement