Beauty Tips: మార్కెట్లో దొరికే.. కెమికల్‌ ప్రొడక్ట్స్‌ కంటే ఇవే మేలు! | Beauty Tips: Skin Health Using Natural Ingredients Found At Home | Sakshi
Sakshi News home page

Beauty Tips: మార్కెట్లో దొరికే.. కెమికల్‌ ప్రొడక్ట్స్‌ కంటే ఇవే మేలు!

Jun 13 2026 9:16 AM | Updated on Jun 13 2026 11:26 AM

Beauty Tips: Skin Health Using Natural Ingredients Found At Home

బ్యూటిప్స్‌

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం పొడిబారిపోవడం, కాంతి విహీనంగా మారడం సహజం. అయితే మార్కెట్లో దొరికే కెమికల్‌ప్రొడక్ట్స్‌ కంటే, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వాటితోనే చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా మార్చుకోవచ్చు. 

  • చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడానికి ఓట్‌మీల్, హనీ స్క్రబ్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటర్‌. ఓట్స్‌ను పొడిచేసి అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి స్క్రబ్‌ లాగా అప్లై చేయాలి. ఇది చర్మాన్ని సున్నితంగా శుభ్రం చేయడమే కాకుండా, తేనెలోని గుణాలు చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుతాయి.

  • ముఖానికి తక్షణ మెరుపును ఇవ్వడానికి పసుపు, కాఫీతో పాటు తేనె కాంబినేషన్‌ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫేస్‌ ప్యాక్‌ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఇది ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా, చర్మానికి మంచి తాజాదనాన్ని ఇచ్చి ఆరోగ్యకరమైన లుక్‌ను అందిస్తుంది.

  • చాలామంది అరటిపండు తొక్కను పారేస్తుంటారు. కానీ, అరటిపండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై మెల్లగా రుద్దడం వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇది ముఖానికి ఇన్స్టంట్‌గా ఒక సహజసిద్ధమైన మెరుపును ఇస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement