రారండోయ్‌ | Events in Hyderabad | Sakshi
Sakshi News home page

రారండోయ్‌

Mar 19 2018 12:39 AM | Updated on Sep 4 2018 5:07 PM

Events in Hyderabad - Sakshi

కె.వి.ఆర్‌. ‘శీర్షికలు’ ఆవిష్కరణ సభ మార్చి 23న సాయంత్రం 5:30కు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హాలు, విజయవాడలో జరగనుంది. ‘దళితుల ఆకాంక్షలు– బూర్జువా దళితవాదం’ అంశంపై కేవీఆర్‌ స్మారకోపన్యాసం పాణి చేస్తారు. నిర్వహణ: కె.వి.ఆర్‌. శారదాంబ స్మారక కమిటీ.

మొజాయిక్‌ సాహిత్య సంస్థ పదిహేనో వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభిస్తున్న తొలి సాహిత్య పురస్కారాన్ని సయ్యద్‌ సలీంకు మార్చి 24న విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో ప్రదానం చేయనున్నారు.

కవిసంగమం సీరిస్‌–37లో భాగంగా– మూడు తరాల కవులు అల్లం నారాయణ, దయాకర్‌ వడ్లకొండ, పల్లిపట్టు, రమాదేవి బాలబోయిన, కృష్ణ గుగులోత్‌ తమ కవిత్వాన్ని మార్చి 25న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో వినిపిస్తారు.

ద్వానా శాస్త్రి సప్తతి సందర్భంగా 2016,17,18ల్లో ముద్రితమైన సాహిత్య విమర్శ గ్రంథాలకు 10 వేలు, 5 వేల స్ఫూర్తి పురస్కారాలు ఇవ్వనున్నారు. చిరునామా: డి.శశికాంత్, 1–1–428, అర్చీజ్‌ నెస్ట్, గాంధీనగర్, హైదరాబాద్‌–80.

పల్లా నరసింహులు స్మారక కవితా పురస్కారానికి 2016–17ల్లో వచ్చిన కవితా సంపుటాలను ఏప్రిల్‌ 6లోగా ఆహ్వానిస్తున్నారు. నిర్వహణ: యువసాహితి, ప్రొద్దుటూరు. వివరాలకు: 9985193868

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement