
ప్రయాణమే కాదు అంతకు మించి అంటున్న మెట్రోస్టేషన్లు
స్టాపింగ్ మాత్రమే కాదు జీవనశైలి కేంద్రాలుగానూ
విందు, వినోదాల వేదికలుగా వర్ధితున్న వైనం ప్రయాణికుల ప్రయారిటీలను మారుస్తున్న తీరు
ఎంటర్ టైన్ మెంట్ వేదికలుగా మార్చే ప్రయత్నం ] అలరిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు
హైదరాబాద్ నగరంలోని మెట్రో స్టేషన్లు ఎంటర్‌టైన్‌మెంట్ కేంద్రాలుగా నిలుస్తున్నాయి. కేవలం ప్రయాణానికే కాదు.. షాపింగ్ నుంచి సాంస్కృతిక కార్యక్రమాల వరకూ అన్నింటా ముందుంటోంది. ఆహార కేంద్రాలు, ఫొటో బూత్‌లు వంటివి ప్రయాణికులకు ఆలంబనగా నిలుస్తున్నాయి. నచ్చిన రుచులను ఆస్వాదిస్తూ.. ఇష్టమైన బ్రాండ్స్‌ను కొనుగోలు చేస్తూ.. సరదాగా కాసేపు కాలక్షేపం చేయాలనుకునే వారికి వేదికలుగా నిలుస్తున్నాయి.
ఫొటోలు దిగుతూ.. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ.. బ్రాండెడ్ ఉత్పత్తులు దొరికే స్టోర్స్, సంగీత ప్రదర్శనలు.. ఇవన్నీ ఒకే చోట దొరకాలంటే చాలా మందికి బహుశా నగరంలో పేరొందిన మాల్సే గుర్తుకొస్తాయేమో.. కానీ ఆ జాబితాలోకి మేం కూడా వస్తున్నాం అంటున్నాయి మెట్రో స్టేషన్స్. – సాక్షి, సిటీబ్యూరో
అమీర్‌పేట మెట్రో స్టేషన్ ప్రస్తుతం నగరంలోని రోజువారీ మెట్రో ప్రయాణికులకు పరిచయమైన ఒక ఏరియా స్టాప్ కంటే చాలా ఎక్కువ. దీని సందడికి మెట్రో ఇంటర్‌చేంజ్ దోహదం చేస్తుండగా మరోవైపు ఈ స్టేషన్ ఒక చిన్న తరహా అధునాతన జీవనశైలి కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. ఇక్కడ జూడియో వంటి పేరొందిన ఫ్యాషన్ అవుట్‌లెట్స్, కేఎఫ్‌సీ, థిక్‌షేక్ ఫ్యాక్టరీ, సబ్‌వే వంటి ఆహార పదార్థాలు దొరికే ఫుడ్ కోర్ట్ స్పాట్‌ను తలపిస్తుంది. దీంతో పాటు గిఫ్ట్ స్టోర్స్, గ్రోసరీ షాప్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు మాత్రమే కాదు పలువురు తమ కుటుంబాలతో కూడా ఇక్కడ తరచూ ఆగుతుంటాయి. ఇది ప్రయాణం కోసం మాత్రమే కాకపోవచ్చు ఓ సరదా సాయంత్రపు కాలక్షేపం కోసం, త్వరిత షాపింగ్ కోసం కూడా కావచ్చు.
ఫొటో బూత్ అదనపు అట్రాక్షన్..
ఈ స్టేషన్‌లో పెరుగుతున్న ఆకర్షణల జాబితాకు సరికొత్త హంగులు తోడవుతున్నాయి. ఈ ట్రాన్సిట్ జోన్‌ను ఆకస్మిక జ్ఞాపకాల ప్రదేశంగా మారుస్తోంది రెట్రో–శైలి ఫొటో బూత్. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లోని మొదటి అంతస్తులో ఉన్న ఇన్‌స్టా స్నాప్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేసిన ఫొటోబూత్ ప్రయాణికులను జ్ఞాపకాలను కాపాడుకోడానికి ఆహ్వానిస్తోంది. స్కూల్స్, కాలేజీలకు వెళుతున్నా, పనికి వెళ్తున్నా లేదా తదుపరి రైలు కోసం వేచి ఉన్నా, రోజువారీ రద్దీ నుంచి రిఫ్రెష్ చేసే మరో దారి ఈ బూత్. సిబ్బంది అవసరం లేని ఈ ఫొటో బూత్ పూర్తిగా ఆటోమేటెడ్ పోలరాయిడ్–శైలి ఫొటో స్ట్రిప్‌లను కేవలం రెండు నిమిషాల్లో అందిస్తుంది. ఇంటర్‌ఫేస్ స్క్రీన్–గైడెడ్ చాలా సులభం. బటన్ ప్రెస్ చేయడం, ఫొటో స్టైల్ ఎంచుకోవడం, స్కాన్ చేసి చెల్లించడం.. ఆపై నాలుగు సరదా భంగిమలను ఎంజాయ్ చేయడం.. సోలో షాట్‌ల నుంచి జంట క్లిక్‌లు లేదా గ్రూప్ స్నాప్‌ల వరకూ ఈ బూత్ అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో సెల్ఫీ ప్రియులకు సందర్శనీయ ప్రదేశంగా మారుతోంది.
చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ : బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?
సోషల్ ఇన్‌స్టా జోన్లుగా..
ఫుడ్ కోర్టులు, షాపింగ్ కియోస్క్‌లు, గిఫ్ట్ స్టాల్స్, ఫ్యాషన్ అవుట్‌లెట్స్‌కు నిలయంగా ఉన్న అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ ప్రస్తుతం సోషల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ వేదికగా నిలుస్తోంది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ వంటి ఇంటరాక్టివ్ స్పాట్స్‌కు కేంద్రంగా నిలుస్తోంది. ముఖ్యంగా నగరంలోని యువత నిత్యం ఈ ప్రాంతం మీదుగా వెళ్లాల్సి రావడం, ఇది ఇంటర్ చేంజింగ్ స్పాట్ కావడం.. ప్రయాణీకుల టైంపాస్ కోసం ఏర్పాటు చేసిన వివిధ ఎంటర్‌టైన్మెంట్ వేదికలు కూడా దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి. దీంతో ప్రజల కోసం మెట్రో స్టేషన్‌లో కలి్పంచే మౌలిక సదుపాయాలలోనూ వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఈవెంట్స్ సైతం..
సిటీ మెట్రో స్టేషన్స్‌లో తరచూ సంగీతం, నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పరిమిత సంఖ్యలో కళాకారులను ఆహ్వా నిస్తూ సంగీత దినోత్సవాలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా మెట్రో రైలు స్టాపులు ఇప్పుడు విందు, వినోద కేంద్రాలుగా అవతరిస్తున్నాయి.(వేయించుకు తినండి..అదిరిపోయే రుచి!)