హైదరాబాద్‌లో 5,6 తేదీల్లో డా. ఖాదర్‌ సభలు

Dr Khadar Vali Training Program Event In Hyderabad - Sakshi

అటవీ కృషి నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌ వలి సభలు 2020 జనవరి 5,6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ సభలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం.   

బి.హెచ్‌.ఇ.ఎల్‌.లో: 5వ తేదీ (ఆదివారం) ఉ. 10 గం. నుంచి మ. 1 గం. వరకు హైదరాబాద్‌ రామచంద్రాపురంలోని బి.హెచ్‌.ఇ.ఎల్‌. కమ్యూనిటీ సెంటర్‌లో డా. ఖాదర్‌ సభ జరుగుతుంది. వివరాలకు.. ప్రవీణ్‌బాబు – 76619 09151.

ప్రగతి రిసార్ట్స్‌లో: 5వ తేదీ (ఆదివారం) సా. 4 గం. నుంచి మ. 7 గం. వరకు హైదరాబాద్‌ శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో డా. ఖాదర్‌ వలి సభ జరుగుతుంది.

జె.ఎన్‌.టి.యు.లో: హైదరాబాద్‌ కూకట్‌పల్లి జె.ఎన్‌.టి.యు. ఆవరణలోని యు.జి.సి. హెచ్‌.ఆర్‌.డి.సి. ఆడిటోరియంలో 6వ తేదీ (సోమవారం)న ఉ. 9 గం. నుంచి మ. 11 వరకు జరిగే సభలో డా. ఖాదర్‌ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. డా. రమణానాయక్‌ – 95551 63014, డా. కరుణాకర్‌రెడ్డి – 90529 98899.

ఉస్మానియావర్సిటీలో: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆడిటోరియంలో 6వ తేదీ(సోమవారం) సా. 3 గం. నుంచి 5 గం. వరకు డా. ఖాదర్‌ వలి సభ జరుగుతుంది. వివరాలకు.. డా. రమణానాయక్‌– 95551 63014.

ఫిబ్రవరి 7–9 తేదీల్లో విశాఖలో ఆర్గానిక్‌ మేళా
7న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం
నేలతల్లికి ప్రణమిల్లుతూ రసాయనిక అవశేషాల్లేని అమృతాహారాన్ని పండించే రైతులు తమ ఆహారోత్పత్తులను తాము నిర్ణయించిన ధరకు నేరుగా వినియోగదారులకు అమ్ముకునేందుకు, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడానికి రైతుల మేళాలు ఎంతగానో ఉపకరిస్తాయి. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం (ఆం. ప్ర.) 2020 ఫిబ్రవరి 7,8,9 తేదీల(శుక్ర, శని, ఆదివారాల)లో విశాఖపట్నం ఎం.వి.పి. కాలనీలోని ఎ.ఎస్‌.రాజా గ్రౌండ్స్‌ (ఆళ్వార్‌దాస్‌ గ్రౌండ్స్‌)లో విశాఖ ఆర్గానిక్‌ మేళా నిర్వహించనుంది. వివరాలకు.. 99512 82288, 81251 77871, 94908 10438, 98495 22191.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top