మీకు తెలుసా?

do you know? - Sakshi

వత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు వత్తులను (దీపారాధన) వెలిగించాలి.
ఉదయం పూట తూర్పు దిశగా రెండు వత్తులు ఉండేటట్లు దీపం  ముఖం ఉండాలి.
సాయంత్రం పూట ఒక వత్తి తూర్పుగా, రెండవది పడమటగా ఉండాలి.
శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది.
 దైవప్రసాదాన్ని పారవేయరాదు.
దీపాన్ని నోటితో ఆర్పరాదు.
ఒక దీపం వెలుగుతుండగా, రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు.
దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.
దేవుని పూజకు ఉపయోగించే ఆసనాన్ని వేరొక పనికి వాడరాదు.
దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రాలు చదవకూడదు. పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top