మధుమేహం..బీపీ మందులతో 

Diabetes BP medicines Check for cancer - Sakshi

కేన్సర్‌కు చెక్‌!

మధుమేహం... రక్తపోటుల చికిత్సకు వాడే రెండు మందులు కలిపి వాడితే కేన్సర్‌ కణితుల పెరుగుదలను అడ్డుకోవచ్చునని అంటున్నారు బాసెల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. కేన్సర్‌ కణాలు పెరిగేందుకు అవసరమైన ఇంధన సరఫరాలను అడ్డుకోవడం ద్వారా ఈ మందులు కణితి పెరుగుదలను అడ్డుకుంటాయని సెల్‌ రిపోర్ట్స్‌ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. మధుమేహం కోసం వాడే మెట్‌ఫార్మిన్‌ నేరుగా కేన్సర్‌ కణాలపై దుష్ప్రభావం చూపగలదని.. అయితే ఈ మందును వాడే మోతాదు కారణంగా ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందని... సైరోసింగోపైన్‌ అనే రక్తపోటు నివారణ మందు కూడా చేరినప్పుడు ప్రభావం ఎక్కువవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బెంజిమన్‌ తెలిపారు. పోషకాలను శక్తిగా మార్చే కీలకమైన అణువు ఎన్‌ఏడీ + తగినంత ఉత్పత్తి కాకుండా ఈ మందుల మిశ్రమం కేన్సర్‌ కణాలపై ప్రభావం చూపుతుందని హాల్‌ వివరించారు. కేన్సర్‌ కణాలు అత్యధికం తమ శక్తి అవసరాల కోసం గ్లూకోజ్‌ను లాక్టేట్‌గా మార్చుకుంటాయని, సైరోసింగోపైన్‌ ఈ లాక్టేట్‌ను సరఫరా చేసే రెండు మూలకాలను అడ్డుకుంటుందని తమ పరిశోధనల్లో తెలిసినట్లు బెంజిమన్‌ వివరించారు. 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top