వ్యాను దిగి వ్యాను ఎక్కాడు | Climbed down from the delivery van | Sakshi
Sakshi News home page

వ్యాను దిగి వ్యాను ఎక్కాడు

Feb 17 2017 11:13 PM | Updated on Sep 5 2017 3:57 AM

వ్యాన్‌ దొంగ బాబీ జో

వ్యాన్‌ దొంగ బాబీ జో

దొంగిలిస్తే దొంగిలించాడు. మార్చురీ వ్యాన్‌ని దొంగిలించాడు! కొంత దూరం పోయాక వెనక్కు తిరిగి వ్యాన్‌లోకి చూస్తే.. లోపల శవం ఉంది.

దొంగిలిస్తే దొంగిలించాడు. మార్చురీ వ్యాన్‌ని దొంగిలించాడు! కొంత దూరం పోయాక వెనక్కు తిరిగి వ్యాన్‌లోకి చూస్తే.. లోపల శవం ఉంది. ‘ఓరి దేవుడో!’ అనుకుంటూ ఆ వ్యాన్‌ని తీసుకెళ్లి, దొంగిలించిన చోటే వదిలేశాడు. వదిలేస్తే వదిలేశాడు. అక్కడే ఇంకో వ్యాన్‌ని నొక్కేసి, డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

వెంటనే వాళ్లు ఇతడిని జైలు వ్యాను ఎక్కించారు. పోలీసులు అతడి మీద దొంగతనం కేసు పెట్టారు కానీ, శవాన్ని దొంగిలించే ప్రయత్నం చేశాడన్న కేసు మాత్రం పెట్టలేదు. శవం కోసం అతడు అంత పని ఎందుకు చేస్తాడులే అనుకుని చిన్న కేసుతో సర్దుకుపోయారు. కాలిఫోర్నియాలో ఇప్పుడిదే పెద్ద వార్త!

Advertisement
 
Advertisement
Advertisement