నవంబర్ 14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Celebrities celebrate a birthday on November 14 | Sakshi
Sakshi News home page

నవంబర్ 14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Nov 13 2015 11:39 PM | Updated on Sep 3 2017 12:26 PM

నవంబర్  14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

నవంబర్ 14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రగ్రహానికి సంబంధించినది. ఇందువల్ల వీరు అందంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటారు.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
యండమూరి వీరేంద్రనాథ్ (రచయిత), మమతామోహన్ దాస్ (నటి)
 

ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రగ్రహానికి సంబంధించినది. ఇందువల్ల వీరు అందంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతారు, ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగయోగం, అవివాహితులకు వివాహ యోగం కలుగుతాయి. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. విలాస వస్తువులు కొంటారు. వీరు పుట్టిన తేదీ 14. ఇది బుధ సంఖ ్య కాబట్టి తెలివితేటలు, సమయస్ఫూర్తి, కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు.

విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆగిపోయిన చదువును పూర్తి చే స్తారు. కొత్త టెక్నాలజీ నేర్చుకుంటారు లేదా కొత్త కోర్సులు చేస్తారు. వ్యాపారాన్ని లేదా కొత్తప్రాజెక్టుని ఆరంభిస్తారు, మీడియా రంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. లక్కీ నంబర్స్: 1,5,6; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, పర్పుల్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, ఎల్లో. బ్లూ; లక్కీ డేస్: సోమ, మంగళ, గురు, శుక్రవారాలు. సూచనలు: విష్ణుసహస్రనామ పారాయణ, పేద కన్యల వివాహ ఖర్చులను భరించడం, పేద విద్యార్థులకు టూల్‌కిట్స్ కొనివ్వడం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement
 
Advertisement
Advertisement