breaking news
Mamatamohan Das
-
‘గాడు బలవంతుడే రా.. కానీ నేను భగవంతుడు రా..’ ఆసక్తికరంగా టీజర్
‘మై నేమ్ ఈజ్ భీం రావ్ దేశ్‌ముఖ్..’ అనే జగపతిబాబు డైలాగ్‌తో ‘రుద్రంగి’ సినిమా టీజర్ విడుదలైంది. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 26న విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘స్వాతంత్య్రం అన్నది బానిసలకు కాదు.. అది మా కోసం’, ‘గాడు బలవంతుడే రా.. కానీ నేను భగవంతుడు రా..’(జగపతి బాబు), ‘నీకు ఎదురు తిరిగిన మల్లేశ్గాడు ఖతం కావాలె(మమతా మోహన్ దాస్) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. స్వాతంత్య్రం తర్వాత ఆనాటి తెలంగాణ సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు టీజర్లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శనమోని, సంగీతం: నాఫల్ రాజా. -
కేన్సర్..డోంట్ కేర్
-
నవంబర్ 14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు యండమూరి వీరేంద్రనాథ్ (రచయిత), మమతామోహన్ దాస్ (నటి) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రగ్రహానికి సంబంధించినది. ఇందువల్ల వీరు అందంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతారు, ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగయోగం, అవివాహితులకు వివాహ యోగం కలుగుతాయి. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. విలాస వస్తువులు కొంటారు. వీరు పుట్టిన తేదీ 14. ఇది బుధ సంఖ ్య కాబట్టి తెలివితేటలు, సమయస్ఫూర్తి, కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆగిపోయిన చదువును పూర్తి చే స్తారు. కొత్త టెక్నాలజీ నేర్చుకుంటారు లేదా కొత్త కోర్సులు చేస్తారు. వ్యాపారాన్ని లేదా కొత్తప్రాజెక్టుని ఆరంభిస్తారు, మీడియా రంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. లక్కీ నంబర్స్: 1,5,6; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, పర్పుల్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, ఎల్లో. బ్లూ; లక్కీ డేస్: సోమ, మంగళ, గురు, శుక్రవారాలు. సూచనలు: విష్ణుసహస్రనామ పారాయణ, పేద కన్యల వివాహ ఖర్చులను భరించడం, పేద విద్యార్థులకు టూల్‌కిట్స్ కొనివ్వడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్