అక్టోబర్ 9 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | Celebrities buying a birthday celebration on October 9 | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 9 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Oct 8 2015 11:43 PM | Updated on Sep 3 2017 10:39 AM

అక్టోబర్  9 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

అక్టోబర్ 9 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
వీవీ వినాయక్ (దర్శకుడు), పూనమ్ కౌర్ (నటి)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల స్థిరాస్తులలో వృద్ధి కలుగుతుంది. ఎంతోకాలంగా ఉన్న కోర్టుకేసులలో విజయం కలుగుతుంది లేదా ఇటీవల కొంతకాలంగా మానసిక వ్యధకు గురి చేస్తున్న కేసుల నుండి ఊరట లభిస్తుంది. విద్యార్థులు తమలోని శక్తిసామర్థ్యాలను, తెలివితేటలను బాగా ఉపయోగించుకుని కష్టపడి చదివి, మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. పుట్టిన తేదీ 9. ఇది కూడా కుజునికి సంబంధించిన సంఖ్యే కాబట్టి వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఇతరులను ప్రభావితం చేయగలిగిన కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో మంచి సాంకేతిక నైపుణ్యంతో చురుకుగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. యూనిఫారం ధరించే ఉద్యోగులు మంచి ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించి అధికారుల మన్ననలు అందుకుంటారు. లక్కీ నంబర్స్: 1,5,6,9; అన్ లక్కీ నంబర్: 4; లక్కీ కలర్స్: రెడ్, బ్లూ, గోల్డెన్; లక్కీ డేస్: మంగళ, బుధ, శనివారాలు

సూచనలు: నవగ్రహాలకు అభిషేకం, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం, రక్తదానం చేయటం లేదా చేయించటం, పేదవిద్యార్థులకు పుస్తకాలు, పరికరాలు కొనిపెట్టడం; వాహనాలు నడిపేటపు్పుడు, ఆయుధాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ప్రతీకార ధోరణిని విడనాడటం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్    
 

Advertisement
 
Advertisement
Advertisement