డిసెంబర్ 5న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Celebrating a birthday on December 5 Celebrities | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 5న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Dec 4 2015 11:55 PM | Updated on Sep 3 2017 1:29 PM

డిసెంబర్  5న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

డిసెంబర్ 5న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతు సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరమంతా వీరు ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
సారిక (నటి), కిన్నెర (నటి)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతు సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరమంతా వీరు ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు.  పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.  విద్యార్థులకు, ఉద్యోగులకు విదేశాలకు వెళ్లాలనే కోరిక తీరుతుంది.  భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే ప్రమాదం ఉంది. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. వేదపండితులు, జ్యోతిష్యులకు, వైద్యవిద్యార్థులకు, వైద్యులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భూమిని, ఇంటిని అమ్మే ప్రయత్నాన్ని విరమించు కోవడం మంచిది. మీరు పుట్టిన తేదీ 5. ఇది బుధ సంఖ్య కావడం వల్ల జన్మతః మంచి తె లివితేటలు, సమయస్ఫూర్తి ఉంటాయి. పోటీపరీక్షల్లో విజయం ప్రాప్తిస్తుంది.

లక్కీ నంబర్స్: 1,2,5,6,7; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రే, శాండల్ , గ్రీన్, పర్పుల్, బ్లూ; లక్కీ డేస్: ఆది, సోమ, బుథ, శుక్రవారాలు.

సూచనలు: కేతు జపం చేయించుకోవడం, పండితులను, గురువులను గౌరవించడం, వికలాంగులను, ఆనాథలను ఆదరించడం మంచిది.  - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 
 

Advertisement
 
Advertisement
Advertisement