మాట్లాడే కంప్యూటర్... | Canada company introduce Speaking computer | Sakshi
Sakshi News home page

మాట్లాడే కంప్యూటర్...

Nov 11 2014 10:35 PM | Updated on Sep 2 2017 4:16 PM

మాట్లాడే కంప్యూటర్...

మాట్లాడే కంప్యూటర్...

కంప్యూటర్‌లో సమాచారం వెతుక్కోవడం మనమందరం చేసే పనే. అయితే కావాల్సిన సమాచారం ఎక్కడుందో తెలుసుకోవాలంటే మాత్రం కొంచెం శ్రమకోర్చాల్సి ఉంటుంది.

కంప్యూటర్‌లో సమాచారం వెతుక్కోవడం మనమందరం చేసే పనే. అయితే కావాల్సిన సమాచారం ఎక్కడుందో తెలుసుకోవాలంటే మాత్రం కొంచెం శ్రమకోర్చాల్సి ఉంటుంది. కీవర్డ్‌లు గూగుల్ సెర్చింజిన్‌లో టైప్ చేయాలి, వచ్చే రిజల్ట్స్ చదివి తెలుసుకోవాలి. ఈ బాదరబందీలేవీ లేకుండా నేరుగా మీక్కావలసిన విషయాన్ని తెలుసు కోవాలనుకుంటున్నారా? అయితే ఫొటోలో కనిపిస్తున్న ‘ఉబి’ మీ కోసమే. కెనడాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ఈ పరికరం మానీటర్, కీబోర్డుల్లేని మాట్లాడే కంప్యూటర్. మీరు ప్రశ్న అడగడమే ఆలస్యం... నెట్‌మొత్తాన్ని జల్లెడ పట్టి... సమాధానాలు వెతికి వినిపిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement