21న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

21న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Sep 20 2015 11:59 PM | Updated on Sep 3 2017 9:41 AM

21న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

21న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2...

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: కరీనా కపూర్ (నటి), సింగీతం శ్రీనివాసరావు (దర్శకుడు, నటుడు)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రునికి సంబంధించినది కాబట్టి వీరికి ఈ సంవత్సరం సృజనాత్మకత, ఊహాకల్పన, సౌందర్య పోషణ అలవడతాయి. సంఘంలో మంచి పలుకుబడి సంపాదిస్తారు. అయితే  ఆలోచనలలో నిలకడ ఉండని కారణంగా ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి, తగిన జాగ్రత్తలు అవసరం.  వీరు పుట్టినతేదీ 12. ఇది బృహస్పతికి చెందిన సంఖ్య కావడం వల్ల ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. విజయాలు వరిస్తాయి. కొత్తస్నేహాలు, కొత్తబంధుత్వాలు ఏర్పడి, వాటివల్ల లబ్ధి పొందుతారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, కుటుంబంలో మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి.
 
లక్కీ నంబర్స్: 1,2,3,5; లక్కీ కలర్స్: తెలుపు, క్రీమ్, శాండల్, గోల్డెన్, ఎల్లో; లక్కీ డేస్: సోమ, బుధ, గురు; శుక్రవారాలు.
సూచనలు: చంద్రకాంతమణిని ధరించడం, దక్షిణామూర్తి ఆరాధన, శివుడికి అభిషేకం, గురువులను, పండితులను గౌరవించడం, ఆలయాలు, ప్రార్థనామందిరాలు, మదరసాలలో భోజన సదుపాయాలు కల్పించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement