పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | birthday celebrated celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Aug 19 2015 12:47 AM | Updated on Sep 3 2017 7:40 AM

పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 8...

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సుధామూర్తి (రచయిత్రి), బిల్‌క్లింటన్ (అమెరికా మాజీ అధ్యక్షుడు)
 
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 8. దీనికి అధిపతి అయిన శనైశ్చరుడు వృత్తికారకుడు కావడం వల్ల ఈ సంవత్సరం విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల ఉంటుంది. గత సంవత్సరం నిరుత్సాహంగా, మందకొడిగా ఉన్న వారు సైతం ఈ సంవత్సరం విజయాలను అందిపుచ్చుకుంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కన్నా ఉన్న వాటిని కొనసాగించడం మంచిది.

వీరు పుట్టిన తేదీ 19. ఇది సూర్య, కుజుల కలయిక కావడం వల్ల జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో ఉంటారు. మంచి పేరు, గుర్తింపు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో కష్టపడి ధనం సంపాదిస్తారు. రాజకీయ నాయకులకు బాగా రాణిస్తారు. కంటిజబ్బులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,5,6,8; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రీన్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: మంగళ, శుక్ర, శని, ఆదివారాలు. సూచనలు: ఆదిత్యహృదయం పఠించడం, తండ్రిని కాని, తండ్రితో సమానులైన వారిని కాని ఆదరించడం, అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు తగిన సాయం చేయడం, ఆవులకు బెల్లం, కాకులకు స్వీట్లు పెట్టడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement
 
Advertisement
Advertisement