పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Jul 28 2015 11:22 PM | Updated on Sep 3 2017 6:20 AM

పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు బర్త్‌డే చేసుకొంటున్న వారి సంవత్సర సంఖ్య 8...

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: సంజయ్‌దత్ (నటుడు), సోనియా దీప్తి (నటి)
ఈ రోజు బర్త్‌డే చేసుకొంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది శనికి సంబంధించిన అంకె.శని వృత్తికారకుడు. 2015 సంవత్సర సంఖ్య కూడా 8. దీనిని యూనివర్సల్ ఇయర్ అని అంటారు. ఎవరికైనా, వారి సంవత్సర సంఖ్య, యూనివర్సల్ ఇయర్ ఒకటైన సందర్భంలో ఆర్థికంగా, సామాజికంగా... అన్నింటా అభివృద్ధికరంగా ఉంటుంది. గౌరవ సన్మానాలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరం జీవితంలో ఒక మైలురాయిలాగా గుర్తుండిపోతుంది. మీ పుట్టిన  తేదీ 29. ఇది చంద్ర కుజుల కలయిక వల్ల ఏర్పడిన సంఖ్య. ఈ తేదీలో పుట్టిన వారికి 29 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితంలో వృద్ధి ఉంటుంది. చంద్ర మంగళ యోగం వల్ల విదేశీ యానం ఉంటుంది.

రాజకీయాలలో ఉన్న వారికి తగిన పదవి, గుర్తింపు లభిస్తాయి. అయితే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఆ ప్రతిపాదనలు విరమించుకోవడం మంచిది. పూర్వికుల ఆస్తి కలిసి వస్తుంది. భర్త ఆస్తిలో వాటా లేదా మనోవర్తి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం తప్పక లాభిస్తుంది. పాజిటివ్ ఆలోచనలు చేయడం వల్ల విజయం సాధించగలుగుతారు. లక్కీ నంబర్స్: 2,4,6,8; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, బ్లూ, ఎల్లో, పర్పుల్, గోల్డెన్; లక్కీ డేస్: సోమ, బుధ, శనివారాలు; లక్కీ మంత్స్: జనవరి, ఫిబ్రవరి, జూన్, అక్టోబర్, నవంబర్. సూచనలు: ఈశ్వరార్చన, వికలాంగులకు, వృద్ధులకు సాయం చేయటం, కాకులకు ఆహారం పెట్టడం, బెల్లం, పాలు, బియ్యంతో చేసిన పాయసం లేదా ఇతర తీపి పదార్థాలు పంచిపెట్టడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement
 
Advertisement
Advertisement