పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jun 29 2015 11:08 PM | Updated on Sep 3 2017 4:35 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8...

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: అల్లరి నరేష్ (నటుడు); మైక్ టైసన్ (బాక్సర్)

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల పనులు కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. అయితే ఉద్యోగంలో, వ్యాపారంలో స్థిరత్వాన్ని పొందుతారు. పెద్దల ఆశీర్వచనం వల్ల మనోబలం పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎం.బి.ఎ; ఎల్.ఎల్.బి; సి.ఎ. చదవాలనుకునే విద్యార్థులకు ఇది మంచి కాలం. మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు. అవిశ్రాంతంగా పని చేయడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల తోటివారితో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు ఉత్సాహకరంగా ఉంటుంది. సామాజిక పరమైన ఉన్నతి, గుర్తింపు లభిస్తుంది. కొత్తప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది మంచి తరుణం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. లక్కీ నంబర్స్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు.
 సూచనలు: దక్షిణామూర్తి ఆరాధన, శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధులను ఆదరించడం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి.  
 - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement