పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jun 27 2015 12:11 AM | Updated on Sep 3 2017 4:25 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5...

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: పి.టి.ఉష (క్రీడాకారిణి), కార్తీక (నటి)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధ గ్రహానికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరు బుద్ధిబలం, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. అన్ని ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోయి, వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకోని అవకాశాలు వస్తాయి. కుటుంబ పరంగా ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది. మీ పుట్టిన తేదీ 27 కాబట్టి అది కుజునికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఇతరులను ప్రభావితం చేయగలిగిన కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో మంచి సాంకేతిక నైపుణ్యంతో చురుకుగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగులకు ముఖ్యంగా యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ప్రదర్శించి అధికారుల మన్ననలు అందుకుంటారు. లక్కీ నంబర్స్: 1,5,6,9; అన్ లక్కీ నంబర్: 4; లక్కీ కలర్స్: రెడ్, గ్రీన్, సిల్వర్, బ్లూ, గోల్డెన్; లక్కీ డేస్: మంగళ, బుధ, శనివారాలు; సూచనలు: నవగ్రహాలకు అభిషేకం, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం, రక్తదానం చేయటం, చేయించటం, పేదలకు పుస్తకాలు, పరికరాలు కొనిపెట్టడం; వాహనాలు నడిపేటప్పుడు, ఆయుధాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ప్రతీకార ధోరణిని విడనాడటం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement