పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jun 25 2015 11:40 PM | Updated on Sep 3 2017 4:21 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజుపుట్టిన వారి సంవత్సర సంఖ్య 4...

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సురేష్ గోపి (నటుడు); అర్జున్ కపూర్ (నటుడు)
 
ఈ రోజుపుట్టిన వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహువుకు సంబంధించినది. పుట్టిన తేదీ శనికి సంబంధించినది. ఈ సంవత్సరం మంచి ఆదాయాన్ని కళ్లజూస్తారు. వ్యాపారం చేయాలనే కోరిక నెరవేరుతుంది!  అన్నింటా అభివృద్ధి సాధిస్తారు. స్థలాలు, పొలాలు కొంటారు. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడులు  మీకు బంగారు బాట వేస్తాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి కలలు నెరవేరతాయి.

ఉద్యోగులు ప్రమోషన్‌తోబాటు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం కొత్త సబ్జెక్టులు నేర్చుకుంటారు. న్యాయవాదులకు, న్యాయమూర్తులకు మంచి పేరు ప్రతిష్ఠలు వస్తాయి. రాజకీయ నాయకులకు చాలా ఆశావహంగా ఉంది. ప్రతి విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడటం, ఆరునూరైనా సరే, నమ్మిన సిద్ధాంతం మీదే నిలబడటం వలన మొండివాళ్లన్న పేరు తెచ్చుకుంటారు. లక్కీ నంబర్స్: 1,4,5,6,8; లక్కీ డేస్: శుక్ర, శని, ఆదివారాలు; లక్కీ కలర్స్: బ్లూ, వయోలెట్, క్రీమ్, గోల్డెన్; సూచనలు: నవగ్రహారాధన, పవిత్ర గ్రంథాలను పఠించడం, వృద్ధులకు, అనాథలకు సాయం చేయడం, వాదప్రతివాదనలను నేర్పుగా తప్పించుకోవడం.
 - డా. మహమ్మద్ దావూద్  జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement