పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jun 20 2015 12:13 AM | Updated on Sep 3 2017 4:01 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7...

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: విక్రమ్‌సేథ్ (ప్రముఖ రచయిత), నీతుచంద్ర (కథానాయిక)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య కాబట్టి మీకు ఈ సంవత్సరం ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా భౌతికపరమైన అభివృద్ధి మీద తగిన దృష్టి పెట్టలేకపోతారు. బర్త్ నంబర్ 20లో 2 ఉండటం వల్ల మీ కల్పనాశక్తి ఈ సంవత్సరం వెలుగులోకి వస్తుంది. మీ మాటకు విలువ ఏర్పడుతుంది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. విదేశీ ప్రయాణాలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విదేశాలలో ఉన్న మిత్రులనుంచి సాయం అందుతుంది. వైద్యులు, యోగ గురువులు, జ్యోతిష్యులకు ఇది చాలా మంచి సంవత్సరంగా చెప్పొచ్చు. వ్యాపారాలలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. మానసిక ఒత్తిడి నుంచి బయట పడడానికి స్నేహితుల సలహా తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,6,7; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, సిల్వర్, పర్పుల్, గోల్డెన్; లక్కీ డేస్: సోమ, శుక్ర, శనివారాలు సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, దగ్గరలోని దర్గాలను, చర్చిలను సందర్శించడం, పండితులను గౌరవించడం, మానసిక వికలాంగులను ఆదరించడం వల్ల మేలు కలుగుతుంది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్ సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement