
మదిరాంతకుడు
చేత బీరు జగ్గుతో చిద్విలాసాన్ని చిందిస్తున్న ఈ బ్రిటిష్ పెద్దమనిషి మామూలోడు కాదు. ప్
తిక్క లెక్క
చేత బీరు జగ్గుతో చిద్విలాసాన్ని చిందిస్తున్న ఈ బ్రిటిష్ పెద్దమనిషి మామూలోడు కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద మదిరాంతకుడు. ఇతగాడి పేరు బ్రూస్ మాస్టర్స్. ఇంతకీ ఇతగాడు సాధించిన ఘనత ఏమనే కదా డౌటు? మధుశాలల సందర్శనలో ఇతడిని మించిన వారెవరూ ప్రపంచంలో మరెక్కడా లేరు. ఈ ఘనతే ఇతడి పేరును గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించింది.
ఇప్పుడితని వయసు 67 ఏళ్లు. పన్నెండేళ్ల వయసు నుంచే మదిరాలయాలకు క్రమం తప్పకుండా ప్రతిరోజూ వెళ్లేవాడు. వెళ్లిన చోటికి మరోసారి వెళ్లకుండా 2014 జనవరి నాటికి 46,495 మధుశాలలను పావనం చేశాడు. అంటే, 54 ఏళ్ల వ్యవధిలో సగటున రోజుకు రెండింటి కంటే ఎక్కువ మధుశాలలకు వెళ్లాడన్న మాట.