సహజ సౌందర్యం | beauty tips | Sakshi
Sakshi News home page

సహజ సౌందర్యం

Jan 5 2017 11:06 PM | Updated on Sep 5 2017 12:30 AM

సహజ సౌందర్యం

సహజ సౌందర్యం

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె కాని, ఆలివ్‌ ఆయిల్‌ కాని ముఖానికి, చర్మం పొడిబారిన ప్రదేశాల్లోనూ రాయాలి.

బ్యూటిప్స్‌

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె కాని, ఆలివ్‌ ఆయిల్‌ కాని ముఖానికి, చర్మం పొడిబారిన ప్రదేశాల్లోనూ రాయాలి. ఆయిల్‌ అప్లయ్‌ చేసే ముందు మురికి, దుమ్ము లేకుండా చర్మం శుభ్రంగా ఉండాలి. పొడిచర్మాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. దోసిట్లో నీళ్లు తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇలా రోజూ పది నిమిషాల సేపు ముఖానికి హాట్‌వాటర్‌ థెరపీ చేయాలి.

ఒక కోడిగుడ్డు సొనలో, ఒక టీ స్పూన్‌ కమలారసం, ఒక టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. పొడిచర్మానికి ఈ ప్యాక్‌ మంచి ఫలితాన్నిస్తుంది.  పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్‌సీడ్‌ ఆయిల్‌ బాగా పని చేస్తుంది. దేనితోనూ కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్‌ను ఒంటికి రాసి మర్దన చేస్తే సరిపోతుంది.
     
బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి, ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడనల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపును వదిలిస్తుంది. పొడిచర్మం తీవ్రంగా బాధిస్తున్నప్పుడు అనేక రకాల కాంబినేషన్‌లతో ప్యాక్‌లు తయారు చేసుకోవడానికి సాధ్యం కాకుంటే స్వచ్ఛమైన ఆముదం కాని, అవొకాడో ఆయిల్‌ కాని రాసి మర్దన చేయాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement