బ్యూటిప్‌ | beauty tips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్‌

Apr 5 2018 12:06 AM | Updated on Apr 5 2018 12:06 AM

beauty tips - Sakshi

నిస్తేజంగా కనిపించే పెదవులకు గ్లిజరిన్, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత శుభ్రపరిచి, పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. పొడిబారి మృదుత్వాన్ని కోల్పోయిన పెదవులకు కొద్దిగాఅలొవెరా జెల్‌ రాసి, మృదువుగా రాయాలి. లేదా రోజ్‌వాటర్‌లో గ్లిజరిన్‌ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి.

  గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్‌ను ముంచి, పిండి, ఆ బ్యాగ్‌ను పెదవులపై మూడు, నాలుగు నిమిషాల సేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెదవుల చర్మం పై తేమ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి.  

Advertisement
 
Advertisement
Advertisement