అదోక్కటే కోరిక | Anushka Sharma, Virat Kohli love story | Sakshi
Sakshi News home page

అదోక్కటే కోరిక

Nov 12 2017 8:26 AM | Updated on Nov 12 2017 8:26 AM

Anushka Sharma, Virat Kohli love story - Sakshi

అనుష్క శర్మ ఏది చేసినా ది బెస్ట్‌ ఇవ్వాలనుకుంటుందట.. యాక్టింగ్‌ అయినా, లవ్‌ అయినా, ఇంకేదైనా.. ది బెస్ట్‌ ఇచ్చినప్పుడే గొప్ప అంటుందామె. ‘ది బెస్ట్‌’ అనుష్క గురించి కొన్ని విశేషాలు.. 

 'విరుష్క' కబుర్లు..
అనుష్క శర్మ, ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంటను విరుష్క (విరాట్‌ + అనుష్క) అని పిలుచుకుంటూ ఉంటారంతా. వీరి జంట ఎంత చూడముచ్చటగా ఉంటుందంటే.. రిలేషన్‌షిప్‌ గోల్స్‌ మీరే అంటూ ఈ ఇద్దరూ కనిపించినప్పుడల్లా అభిమానులు కామెంట్స్‌ చేస్తూ ఉంటారు. నిజంగానే రిలేషన్‌షిప్‌ గోల్‌లా ఉంటారు చూడ్డానికి కూడా!  అనుష్క నన్ను వ్యక్తిగా మరింత ఎదిగేలా చేసింది’’ అంటాడు కోహ్లి.విరాట్‌తో ఉంటే ధైర్యంగా ఉంటుంది అంటుంది అనుష్క. ఇద్దరూ తమ తమ కెరీర్స్‌లో ది బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడైనా బయట ప్రెస్‌తో మాట్లాడడానికి వచ్చినా వాళ్ల కెరీర్‌ గురించే మాట్లాడుతుంటారు. లవ్‌ విషయం ఎత్తితే, పర్సనల్‌’ అని చిన్నగా నవ్వుతారు. 

ఆర్మీ ఆఫీసర్‌ కూతురినే..
అనుష్క శర్మ తండ్రి అజయ్‌ కుమార్‌ శర్మ ఆర్మీ ఆఫీసర్‌. ఆమె చదువంతా ఆర్మీ స్కూల్లోనే సాగింది. మొదట్లో జర్నలిస్ట్‌ అవ్వాలనుకుందట. ఆ తర్వాత రూటు మార్చుకొని యాక్టింగ్‌ను ఎంచుకుంది. ఈ రోజు దేశంలోనే పాపులర్‌ స్టార్స్‌లో ఒకరైనా కూడా, అనుష్క, తనను తాను ఒక ఆర్మీ ఆఫీసర్‌ కూతురుగా చెప్పుకునేందుకే ఇష్టపడుతుందట!

నన్నూ రిజెక్ట్‌ చేశారు..
లైఫ్‌లో ఫెయిల్యూర్స్‌ అన్నవి చాలా సహజం. నేను ఈరోజు పెద్ద స్టార్‌ని అయిపోయినంత మాత్రాన కెరీర్‌ మొదట్నుంచీ అన్నీ కలిసొచ్చాయని కాదు. పదహారేళ్లున్నప్పుడే రిజెక్షన్‌ ఎలా ఉంటుందో చూశా. వరుసగా అవకాశాలు వచ్చేవి, ఓహ్‌ వావ్‌ అనుకునేంతలోనే అవి వెళ్లిపోయేవి. అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. ఒకసారి అవకాశం మిస్సైతే బాధపడిపోకూడదు. మళ్లీ ఇంకో అవకాశం వచ్చేవరకూ కష్టపడాలి అంటుంది. అలా కష్టపడ్డాకే కదా, అనుష్క ఎంట్రీయే (రబ్‌ నే బనా దీ జోడీ) బ్లాక్‌బస్టర్‌తో ఇచ్చింది. 

క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌.. 
నిరూపించు కోవడానికి ఎప్పుడూ ఏదో ఒక చాలెంజ్‌ ఉండాలంటారు. అనుష్క యాక్టర్‌గా ఆ చాలెంజ్‌ ఫేస్‌ చేసింది. నిరూపించుకుంది. అక్కడే ఉండిపోవాలను కోలేదు. ఇప్పుడొస్తున్న సినిమాలకు భిన్నంగా ఏదైనా చేయాలనుకుంది. నిర్మాతగా మారాలనుకుంది. అలా పుట్టిందే క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌. ఈ బ్యానర్లో అనుష్క నిర్మాతగా చేసిన సినిమాలు రెండూ హిట్టే! ఇదే బ్యానర్‌లో ఇంకొన్ని వండర్స్‌ చేస్తా అని ధీమాగా చెప్తోంది! ఈమధ్యే ‘నుష్‌’ పేరుతో ఒక క్లాతింగ్‌ బ్రాండ్‌ కూడా లాంచ్‌ చేసింది. 

అదొక్కటే కోరుకునేది! 
అనుష్క కెరీర్‌ పీక్స్‌లో ఉంది. లవ్‌ లైఫ్‌ వేరే వాళ్లకు రిలేషన్‌షిప్‌ గోల్‌లా ఉంది. ఆమె గోల్స్‌ అన్నీ పక్కాగా ఉన్నాయి. ఇన్ని ఉన్నా, ఇవన్నీ చాలా బాగున్నా, అనుష్క మాత్రం ఎప్పుడూ కోరుకునే ఓ కోరిక ఏంటో తెల్సా? మనిషిగా రోజూ ఒక మెట్టు పైకెక్కడం  మనిషిగా నన్ను నేను రోజూ ఎదుగుతూ ఉండటం చూస్తే ఈ లైఫ్‌ సరిగ్గా నడుస్తోంది అనుకుంటా అంటుంది అనుష్క. ఆమె ఇంకా ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement