వ్యాయామంతో వృద్ధాప్యం దూరం...

Aging distance with exercise  - Sakshi

వయసుతో సంబంధం లేకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఆయుష్షు కూడా తగ్గుతుందని బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటున్నారు. సైక్లింగ్‌తోపాటు ఇతర వ్యాయామాలు చేసే కొంతమంది (55 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు) పై పరిశోధనలు చేసిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వ్యాయామం కేవలం కండరాలను గట్టిపరచడానికి మాత్రమే కాకుండా రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోందని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది.

రోగ నిరోధక కణాలు (టీ–సెల్స్‌) తయారు చేసే థైమస్‌ అనే అవయవం ఇరవై ఏళ్ల తరువాత ఉత్పత్తిని తగ్గించేస్తుందని, వ్యాయామం ఈ పరిస్థితిని మార్చేస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జానెట్‌ లార్డ్‌ తెలిపారు. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం బలహీనమైపోతుందనే భావన కూడా సరికాదని, అందుకే తాము జీవితాంతం వీలైనంత వరకూ శారీరక శ్రమ చేయడం మంచిదని తమ అంచనా అంటున్నారు డాక్టర్‌ నిహారికా అరోరా దుగ్గల్‌. వయసు మీదపడిన తరువాత జబ్బులు సాధారణమన్నది తెలిసినప్పటికీ, దీన్ని వ్యాయామం ఆపివేయడానికి సాకుగా చూపరాదని హెచ్చరిస్తున్నారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top