ఒక్క మ్యాచ్‌లో 15.3 కిలోమీటర్లు | 15.3 km one match | Sakshi
Sakshi News home page

ఒక్క మ్యాచ్‌లో 15.3 కిలోమీటర్లు

Jul 11 2014 11:40 PM | Updated on Oct 22 2018 5:58 PM

సాకర్ మ్యాచ్‌లో ప్రతీ ఆటగాడు అటూ ఇటూ పరిగెత్తడం సాధారణమైన విషయం. కొందరు ప్లేయర్లు వేగంగా... మరికొందరు నెమ్మదిగా పరిగెత్తుతారు.

సాకర్ మ్యాచ్‌లో ప్రతీ ఆటగాడు అటూ ఇటూ పరిగెత్తడం సాధారణమైన విషయం. కొందరు ప్లేయర్లు వేగంగా... మరికొందరు నెమ్మదిగా పరిగెత్తుతారు. అయితే 90 నిమిషాల పాటు సాగే సాకర్ మ్యాచ్‌లో ఒక ప్లేయర్ అత్యధికంగా ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తుతాడో తెలుసా ? స్పోర్ట్స్ వీయూ ట్రాకింగ్ టెక్నాలజీ ప్రకారం సాకర్ ఆటగాడు ఒక మ్యాచ్‌లో అత్యధికంగా 9.5 మైళ్లు (15.3 కిలోమీటర్లు) పరిగెత్తుతాడు. జట్టులో ఆటగాళ్లు ప్రతీ ఒక్కరు ఇదే స్థాయిలో పరిగెత్తే అవకాశాల్లేవు.

ఆటగాళ్లు తాము ఉన్న పొజిషన్‌ను బట్టి కొందరు ఎక్కువగా.. కొందరు చాలా తక్కువగా పరిగెత్తుతారు. మిడ్ ఫీల్డర్ అత్యధికంగా 15.3 కిలోమీటర్లు పరిగెత్తితే.. అత్యల్పంగా గోల్‌కీపర్ తేలుతాడు. మొత్తానికి ఓ మ్యాచ్‌లో గంటన్నర పాటు 22 మంది ఆటగాళ్లు మైదానంలో పరిగెత్తింది లెక్కేస్తే దాదాపు 155 కిలోమీటర్లుగా తేలింది.
 

Advertisement
 
Advertisement
Advertisement