వైఎస్ఆర్ సీపీ ఎన్నికల పరిశీలకుల నియామకం | YSRCP appoints elections observers | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఎన్నికల పరిశీలకుల నియామకం

Apr 20 2014 9:28 PM | Updated on May 29 2018 4:06 PM

వైఎస్ఆర్ సీపీ ఎన్నికల పరిశీలకుల నియామకం - Sakshi

వైఎస్ఆర్ సీపీ ఎన్నికల పరిశీలకుల నియామకం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు జిల్లాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. మరికొందరు నాయకులకు పార్టీ కార్యవర్గంలో చోటు కల్పించారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు జిల్లాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. మరికొందరు నాయకులకు పార్టీ కార్యవర్గంలో చోటు కల్పించారు. కడప జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డిని నియమించారు. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్డం ఎన్నికల పరిశీలకుడిగా షౌకత్‌ అలీ, ప్రకాశం జిల్లా ఎన్నికల కో ఆర్డినేటర్‌గా అబ్దుల్‌ ఖదీర్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడిగా జనక్‌ ప్రసాద్‌ వ్యవహరించనున్నారు.

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఓవీ రమణను నియమించారు. ఇక వైఎస్ఆర్ సీపీ క్రిస్టియన్‌, మైనార్టీ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా జార్జి హెర్బర్ట్‌,  సీమాంధ్ర జిల్లాల మైనార్టీ సెల్‌ కో ఆర్డినేటర్‌గా నజీర్‌ అహ్మద్‌, వైఎస్ఆర్ సీపీ సీఈసీ సభ్యుడిగా ఇక్బాల్‌ హుస్సేన్‌ ఫరూకిలను నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement