నేటి నుంచి విజయమ్మ పర్యటన | ys vijayamma election campaign begin from tenali constituency | Sakshi
Sakshi News home page

నేటి నుంచి విజయమ్మ పర్యటన

Apr 12 2014 3:25 AM | Updated on Jan 7 2019 8:29 PM

నేటి నుంచి విజయమ్మ పర్యటన - Sakshi

నేటి నుంచి విజయమ్మ పర్యటన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శనివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శనివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభిస్తున్నారు. ఆమె 12వ తేదీన తెనాలి శాసనసభా నియోజకవర్గంలోని కొలకలూరు, గుడివాడ, కోపల్లి, అంగలకుదురు, వేమూరు నియోజకవర్గంలోని దుండిపాలెం, ఎడ్లపల్లి, ఒలివేరు, చుండూరు, మోదుకూరు, మోపర్రు, తురిమెళ్ల, అమృతలూరు, గోవాడ, ఎలవర్రు, ఇంటూరు, బాపట్ల నియోజకవర్గంలోని చందోలి గ్రామాల్లో పర్యటిస్తారని రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
జగన్ పర్యటన మరో రోజు వాయిదా
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన మరో రోజు వాయిదా పడిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఈనెల 13నుంచి తన ప్రచారాన్ని కర్నూలు నుంచి పునఃప్రారంభిస్తారు.
 
13 నుంచి తెలంగాణలో షర్మిల ప్రచారం
జగన్ సోదరి షర్మిల ఈ నెల 13వ తేదీ నుంచి తెలంగాణ ప్రాంతంలో పర్యటించి పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement