సునీతపై పరువునష్టం దావా వేస్తా: తోపుదుర్తి | will file defamation suit on sunita, says prakash reddy | Sakshi
Sakshi News home page

సునీతపై పరువునష్టం దావా వేస్తా: తోపుదుర్తి

May 6 2014 8:17 AM | Updated on Aug 14 2018 4:24 PM

సునీతపై పరువునష్టం దావా వేస్తా: తోపుదుర్తి - Sakshi

సునీతపై పరువునష్టం దావా వేస్తా: తోపుదుర్తి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగనోట్లు పంచుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంపై రాప్తాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. గఎన్నికలు 2014, పరిటాల సునీత, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, రాప్తాడు, పరువునష్టం దావా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగనోట్లు పంచుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంపై రాప్తాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎల్లోమీడియా ద్వారా తనపై నిందలు వేస్తున్నారని, తనపై దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాతో పాటు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతపై పరువునష్టం దావా వేస్తానని ప్రకాష్ రెడ్డి చెప్పారు.

దొంగనోట్లు, నకిలీ మద్యం పంపిణీ చేస్తున్నది టీడీపీ నేతలేనని, అది చాలదన్నట్లు దొంగే దొంగ అన్నట్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓటమి భయంతో పరిటాల సునీత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, న్యాయం ఎవరివైపు ఉందో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement