
ఓటనే వజ్రాయుధాన్ని సరిగ్గా సంధించాలి: శుభ్ర అయ్యప్ప
ప్రజాస్వామ్య పరిరక్షణకు, మహిళల సంరక్షణకు ఎవరైతే సమర్థంగా కృషిచేయగలరని భావిస్తారో అటువంటి నేతలనే ఎన్నుకోవాలి. మన అభివృద్ధి మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి.
ప్రజాస్వామ్య పరిరక్షణకు, మహిళల సంరక్షణకు ఎవరైతే సమర్థంగా కృషిచేయగలరని భావిస్తారో అటువంటి నేతలనే ఎన్నుకోవాలి. మన అభివృద్ధి మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి. ఓటును నోటుకు అమ్ముకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. చాలామంది అమాయకులు తెలియక ఎవరెక్కువ డబ్బులిస్తే వారికే ఓటేస్తున్నారు.. ఇలా చేస్తే రానున్న ఐదేళ్లూ మనం కష్టాలు పడాలి. సమర్ధులైన వారికి, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చగల సత్తా ఉన్న వారికే ఓటెయ్యాలి. వజ్రాయుధమైన ఓటును సరిగ్గా సంధించాలి..
- శుభ్ర అయ్యప్ప, హీరోయిన్