breaking news
Shubhra ayyappa
-
ఇప్పుడు కాదు.. : సుభ్రా అయ్యప్ప
చిట్‌చాట్: టూరిస్ట్ప్లేసెస్ గురించి తెల్సినవారికి, పర్యాటక పిపాసులకు అత్యంత ఇష్టమైన టూరిస్ట్ స్పాట్ కూర్గ్. కర్ణాటకలోని అత్యంత సుందరమైన ప్రాంతాల్లో ఒకటైన కూర్గ్ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ సుభ్రా అయ్యప్ప... ప్రతినిధిలో నారా రోహిత్‌తో నటించింది. త్వరలో రానున్న యవ్వనం ఓ ఫాంటసీ అనే సినిమాలోనూ కనిపించనుంది. ‘హాట్ హాట్‌గా’ టాలీవుడ్ సినిమాల్లో సందడి చేస్తోన్న ఈ అప్‌కమింగ్ అందాల హీరోయిన్ను తాజ్‌కృష్ణ హోటల్లో కలసి మాట్లాడినప్పుడు ‘‘నేను పుట్టిన ఊరు ప్రకృతి అందాల నిలయం కూర్గ్’’ అంటూ చెప్పి మురిసిపోయింది. కూర్గ్‌లో పుట్టినా, తాను పెరిగింది, చదివిందీ అంతా బెంగళూర్లోనే అని చెప్పింది. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తున్న ఈ పొడగరిని... టాలీవుడ్ హీరోల పక్కన నప్పుతావా? అని అడిగితే... ‘ఊ ఊ’ అంటూ ఒక్కక్షణం ఆలోచించి.. ‘‘ఇప్పుడు వస్తున్న యంగ్‌హీరోల్లో చాలా మంది మంచి హైట్ ఉన్నవారేగా పర్లేదు’’ అంది. తన పొడుగరితనమే తనను అందలాలు ఎక్కించిందని చెబుతూ ‘‘ఈ హైట్ వల్లే మోడలింగ్‌లోకి అక్కడి నుంచి యాడ్స్‌లోకి అలా అలా తెలుగు సినిమాల్లోకి వచ్చేశా’’నంది. సరే.. మరి బాయ్‌ఫ్రెండ్ మాటేమిటి? అనడిగితే ‘‘బాయ్‌ఫ్రెండా... నాట్ నౌ. ఇప్పుడు దృష్టి అంతా కెరీర్ మీదే’’ అని తేల్చేసింది. నచ్చే హీరో మహేష్‌బాబు అని నచ్చిన హీరోయిన్ అనుష్క శెట్టి అంటూ చెప్పింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేదని నచ్చిన పాత్ర ఎక్కడ ఇచ్చినా చేస్తానంటూ అన్ని ‘వుడ్’లకూ వెల్కమ్ బోర్డ్ పెట్టేసింది. - ఎస్.సత్యబాబు -
ఓటనే వజ్రాయుధాన్ని సరిగ్గా సంధించాలి: శుభ్ర అయ్యప్ప
ప్రజాస్వామ్య పరిరక్షణకు, మహిళల సంరక్షణకు ఎవరైతే సమర్థంగా కృషిచేయగలరని భావిస్తారో అటువంటి నేతలనే ఎన్నుకోవాలి. మన అభివృద్ధి మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలి. ఓటును నోటుకు అమ్ముకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. చాలామంది అమాయకులు తెలియక ఎవరెక్కువ డబ్బులిస్తే వారికే ఓటేస్తున్నారు.. ఇలా చేస్తే రానున్న ఐదేళ్లూ మనం కష్టాలు పడాలి. సమర్ధులైన వారికి, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చగల సత్తా ఉన్న వారికే ఓటెయ్యాలి. వజ్రాయుధమైన ఓటును సరిగ్గా సంధించాలి.. - శుభ్ర అయ్యప్ప, హీరోయిన్