వాజ్‌పేయే బలహీన ప్రధాని | Vajpeye weak PM | Sakshi
Sakshi News home page

వాజ్‌పేయే బలహీన ప్రధాని

Apr 15 2014 2:29 AM | Updated on Mar 18 2019 7:55 PM

వాజ్‌పేయే బలహీన ప్రధాని - Sakshi

వాజ్‌పేయే బలహీన ప్రధాని

నరేంద్ర మోడీని ఇరుకునపెట్టేందుకు మాజీ ప్రధాని వాజ్‌పేయిని గొప్ప నాయకుడుగా ఇటీవల అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ అంతలోనే మాట మార్చింది.

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీని ఇరుకునపెట్టేందుకు మాజీ ప్రధాని వాజ్‌పేయిని గొప్ప నాయకుడుగా ఇటీవల అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ అంతలోనే మాట మార్చింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను బీజేపీ బలహీన ప్రధానిగా అభివర్ణిస్తుండటంతో మండిపడిన కాంగ్రెస్...దేశ చరిత్రలో వాజ్‌పేయే అత్యంత బలహీన ప్రధాని అంటూ విమర్శలు గుప్పించింది. పాకిస్థాన్‌ను ఎదుర్కొనే విషయంలో దేశ సరిహద్దులను, ప్రయోజనాలను వాజ్‌పేయి కాపాడలేకపోయారని ఆరోపించింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో సీఎంగా మోడీని తొలగించాలనుకున్నా అందులోనూ విఫలమయ్యారంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement