టీడీపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ | TDP and congress party attempt conflict | Sakshi
Sakshi News home page

టీడీపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ

May 1 2014 2:56 AM | Updated on Mar 18 2019 7:55 PM

మండలంలోని పీక్లానాయక్‌తండాలో బుధవారం సాధారణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజెంట్లపై రౌడీషీట్ ఉందని, వారిని ఏజెంటుగా ఎలా నియమిస్తారని టీడీపీవారు వాగ్వాదానికి దిగారు.

 పీక్లానాయక్‌తండా(మేళ్లచెర్వు), న్యూస్‌లైన్: మండలంలోని పీక్లానాయక్‌తండాలో బుధవారం సాధారణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీడీ పీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజెంట్లపై రౌడీషీట్ ఉందని, వారిని ఏజెంటుగా ఎలా నియమిస్తారని  టీడీపీవారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.
 
 దీంతో  ఇరువర్గాల కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇరువురికి గాయాలయ్యయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సీఐ మొగిలయ్య పోలింగ్ ముగిసేవరకు అక్కడే వుండి పరి స్థితిని సమీక్షించారు. అదే విధంగా అడ్డూర్‌లో పోలింగ్ ఏజెంట్‌ల మధ్య గొడవ జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవూరులో కాంగ్రెస్, టీడీపీ వర్గీయులు పరస్పర విమర్శలకు దిగగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement