నేడు షర్మిల పర్యటన | sharmila arrives ananthapuram to day | Sakshi
Sakshi News home page

నేడు షర్మిల పర్యటన

Apr 24 2014 3:17 AM | Updated on Aug 17 2018 8:19 PM

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నేడు (గురువారం) జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

సాక్షి, అనంతపురం :  మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నేడు (గురువారం) జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి 10 గంటలకు కదిరిలో రోడ్ షో నిర్వహించి, సభలో ప్రసంగిస్తారు.

 

11 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబుళదేవరచెరువులో రోడ్‌షో నిర్వహించి.. మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు మడకశిర, 5.30 గంటలకు హిందూపురంలో రోడ్‌షోలు నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. రాత్రికి కదిరిలో బస చేసి.. శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లాకు వెళతారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, షర్మిల కార్యక్రమాల సమన్వయకర్త డాక్టర్ హరికృష్ణ తెలిపారు. షర్మిల రాకతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement