మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్వగ్రామం జూటూరులో పోలీసులు ఓవరాక్షన్ చేశారు.
అనంతపురం : మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్వగ్రామం జూటూరులో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ హేమనాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో వైఎస్ఆర్ సీపీ ఏజెంట్ లేకుండానే పోలింగ్ ఏకపక్షంగా కొనసాగుతోంది. జిల్లాలో 32 జెడ్పీటీసీ, 399 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. కాగా ఫ్యాక్షన్ గ్రామాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను మాత్రమే అరెస్ట్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కాగా ప్రాదేశిక ఎన్నికల తుది సమరానికి తెర లేచింది. రాష్ట్రంలోని సగం పల్లెల్లో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయి. తుది విడతలో 536 జడ్పీటీసీ స్థానాలకు 2,469 మంది, 7,975 ఎంపీటీసీ స్థానాలకు 25,621 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలను శాసనసభ ఎన్నికల ఫలితాల కంటే రెండు మూడు రోజుల ముందుగా ప్రకటించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసుకుంది.