నామినేషన్లకు తెర | nominations ended for general elections | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు తెర

Apr 10 2014 2:16 AM | Updated on Sep 2 2017 5:48 AM

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వానికి తెరపడింది. ఈనెల 2వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ బుధవారంతో ముగిసింది.

ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వానికి తెరపడింది. ఈనెల 2వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ బుధవారంతో ముగిసింది. పొత్తుల వ్యవహారం, అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో మొదటి రెండు రోజులు నామమాత్రంగానే నామినేషన్లు దాఖలు కాగా, చివరి రోజు మాత్రం భారీ సంఖ్యలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు వేశారు. మొత్తంగా..ఖమ్మం లోక్‌సభ స్థానానికి 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు 232 మంది నామినేషన్లు వేశారు.

 ఆయా అసెంబ్లీ స్థానాల్లో నామినేషన్ల వివరాలు..
 సత్తుపల్లి నుంచి 14 మంది, అశ్వారావుపేట నుంచి 18 మంది, భద్రాచలం నుంచి 19మంది, పినపాక నుంచి 20 మంది, ఇల్లెందు నుంచి 40 మంది, పాలేరు నుంచి 25 మంది, మధిర నుంచి 20 మంది, ఖమ్మం నుంచి 31 మంది, వైరా నుంచి 18 మంది, కొత్తగూడెం నుంచి 27 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్లకు ఒక్కరోజు ముందు పార్టీల అభ్యర్థుల టికెట్లు ఖరారు కావడంతో వీరంతా ఒకే సారి నామినేషన్లు వేయడంతో నియోజకవర్గాలు, జిల్లా కేంద్రంలో సందడిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement