టీడీపీలో ప్రజాస్వామ్యం లేదు | no democracy in tdp, says tv rama rao | Sakshi
Sakshi News home page

టీడీపీలో ప్రజాస్వామ్యం లేదు

Apr 28 2014 10:29 AM | Updated on Aug 14 2018 4:21 PM

టీడీపీలో ప్రజాస్వామ్యం లేదు - Sakshi

టీడీపీలో ప్రజాస్వామ్యం లేదు

తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం అన్నది లేనే లేదని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం అన్నది లేనే లేదని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీకి పట్టున్న చోట్ల కూడా సరైన నాయకులకు టికెట్లివ్వకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మొత్తం ఇప్పుడు కార్పొరేట్ సిండికేట్ చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన విమర్శించారు.

తనకు టికెట్ ఇవ్వకపోయినా.. పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా తన గెలుపు ఖాయమన్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి మురళీ మోహన్ను ఓడిస్తానని గతంలోనే చెప్పిన రామారావు, ఇప్పుడు నేరుగా పార్టీ అధిష్ఠానంపైనే విమర్శలకు దిగారు. గెలుపుతోనే తన ప్రత్యర్ధులకు సమాధానం చెబుతానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement