కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు


జోగిపేట, న్యూస్‌లైన్:  కాంగ్రెస్‌తో ఎట్టిపరిస్థితిలో పొత్తు ఉండదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీష్‌రావు స్పష్టం చేశారు.  ఏప్రిల్ 1న జోగిపేట శివారులో నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన సభా వేదిక స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రసక్తేలేదని, ఆ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలను తికమక పెట్టేందుకు పొత్తులు ఉంటాయంటూ చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణను కోరుకుంటున్నారని, ఆదిశగా టీఆర్‌ఎస్ కృషి చేయనుందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల అభ్యర్థుల జాబితా సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచే గుర్రాలనే గుర్తించి టికెట్లను పార్టీ అధిష్టానవర్గం ఖరారు చేస్తుందన్నారు. ఆయనతోపాటు మాజీ ఎంపి పి.మాణిక్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, అందోల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పి.కిష్టయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పి.శివశేఖర్, డాకూర్  సర్పంచ్ ఏ.శంకరయ్య, నాయకులు డిబి.నాగభూషణం, ఎల్లయ్య, అరవిందరెడ్డి, అనిల్‌గౌడ్ తదితరులు ఉన్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top