‘ఆమె’దే హవా! | more lady candidates in municipal elections | Sakshi
Sakshi News home page

‘ఆమె’దే హవా!

Mar 29 2014 3:24 AM | Updated on Oct 9 2018 5:27 PM

మహిళలు నిజంగా మహారాణులు. వంటింటికే కాదు.. అవకాశం వస్తే దేశాన్ని అయినా ఏలుతామనే ఉత్సాహంతో ఉన్నారు.

సాక్షి, మంచిర్యాల : మహిళలు నిజంగా మహారాణులు. వంటింటికే కాదు.. అవకాశం వస్తే దేశాన్ని అయినా ఏలుతామనే ఉత్సాహంతో ఉన్నారు. రిజర్వేషన్‌తో మహిళలే అధికారంలో కీలకం కానున్నారు. గెలుపు ఓటములతో నేతల తలరాతలు మార్చనున్నారు. జి ల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉండగా 1.75 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. పురబరిలో 1095 మంది  నిలువగా ఇందులో 568 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. జిల్లాలోని మంచిర్యాల, ఆదిలాబాద్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు మహిళలకే రిజర్వు అయ్యాయి. ఒక్క నిర్మల్ మాత్రం జనరల్ అయింది.

 ఈ అవకాశాన్ని వినియోగించుకుని సత్తా చాటే దిశగా మహిళలు ముందడుగు వేస్తున్నారు. పాలనలో తమ ముద్ర పడేలా ప్రజాప్రాతినిధ్యాన్ని మహిళామణులు ఎంచుకొంటున్నారు. పురపోరులో తమ సత్తాను వారు సిద్ధం అవుతున్నారు. కలిసివచ్చిన మహిళా రిజర్వేషన్, వార్డులవారీ రిజర్వేషన్లను అందిపుచ్చుకునే దిశగా పెద ్ద ఎత్తున నారీలోకం బరిలోకి దిగుతోంది. వీరి ఉత్సహాన్ని గమనించిన రాజకీయ పార్టీలు సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో బరిలో దించాయి. జిల్లాలోని అన్ని పురపాలిక సంఘాల్లో పెద్ద ఎత్తున పోటీ చేసే అవకాశాన్ని మహిళామణులు దక్కించుకున్నారు.

 పొదుపు సంఘాల ద్వారా సాధించిన చైతన్యాన్ని, తమ కోణంలో సమాజాన్ని చూడటం ద్వారా కలిగిన జ్ఞానాన్ని ప్రజాసంక్షేమం కోసం అమలులో పెడతామని కాబోయే ప్రజాప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వీలైనంత మేరకు ఓటర్ల కోణంలోనే పాలకుల నిర్ణయాలు ఉండేలా చూస్తామని హామీ ఇస్తున్నారు. పట్టణాన్ని పట్టి పీడి స్తున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని పేర్కొంటున్నారు.

 సగం కంటే ఎక్కువ అభ్యర్థులు స్త్రీలే!
 జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీలో పురుషుల కంటే మహిళా అభ్యర్థులు ఎక్కువగా ఉన్న అన్ని మున్సిపాలిటీలలో ప్రథమ స్థానంలో ఉంది. 204 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా అందులో 120 మంది స్త్రీలే కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement