‘మోడీ నిఘా’పై కమిషన్ లేదు: కేంద్రం | Sakshi
Sakshi News home page

‘మోడీ నిఘా’పై కమిషన్ లేదు: కేంద్రం

Published Sat, May 10 2014 1:17 AM

'Modi intelligence on Not the Commission: Centre govt

న్యూఢిల్లీ: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర పోలీసులు ఓ మహిళపై నిఘా ఉంచి నట్లు చెబుతున్న ‘స్నూప్‌గేట్’ వివాదంపై విచారణ జరిపేందుకు ఎలాంటి విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయబోవట్లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరణ్ న్యాయమూర్తులు జస్టిస్ రంజనా దేశాయ్, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనానికి శుక్రవారం తెలియజేశారు.

స్నూప్‌గేట్‌పై దర్యాప్తు జరిపేం దుకు విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర న్యాయమంత్రి కపిల్ సిబల్ ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. ఈ నిఘా వ్యవహారంపై దర్యాప్తుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు ఏర్పాటు చేయకుండా నిరోధించాలంటూ స్నూప్‌గేట్ వివాదంలో కేంద్ర బిందువైన మహిళ తన తండ్రితో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.
 
 

Advertisement
Advertisement