ఆ మాట వాస్తమే...అయితే.... | KCR is efficient to develop Telangana | Sakshi
Sakshi News home page

ఆ మాట వాస్తమే...అయితే....

May 18 2014 4:53 PM | Updated on Aug 15 2018 9:20 PM

కొప్పుల ఈశ్వర్ - Sakshi

కొప్పుల ఈశ్వర్

గతంలో దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ చెప్పిన మాట వాస్తవమేనని టీఆర్‌ఎస్‌ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అంగీకరించారు.

హైదరాబాద్: గతంలో  దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ చెప్పిన మాట వాస్తవమేనని  టీఆర్‌ఎస్‌ ధర్మపురి ఎమ్మెల్యే  కొప్పుల ఈశ్వర్‌ అంగీకరించారు. అయితే ఇప్పుడున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే కేసీఆర్‌కే సాధ్యం అని ఆయన అన్నారు.  తెలంగాణ అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్‌ను ఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.

దళితులకు కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీలేదని విమర్శించారు. అందుకే దళితులు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని చెప్పారు.  దళితుల కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని ఈశ్వర్‌ హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement