జగన్‌తోనే మళ్లీ మంచి రోజులు | Jagan good days again | Sakshi
Sakshi News home page

జగన్‌తోనే మళ్లీ మంచి రోజులు

May 5 2014 2:04 AM | Updated on Aug 17 2018 8:06 PM

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణపాలన మళ్లీ కావాలంటే జగన్‌మోహనరెడ్డికి పట్టంకట్టాలని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ పిలుపునిచ్చారు.

  •    అనకాపల్లి ఎంపీ అభ్యర్థి అమర్‌నాథ్
  •    భారీ ర్యాలీతో హోరెత్తిన మునగపాక
  •   నందీశ్వర ప్రాంగణం వద్ద భారీ బహిరంగ సభ
  •  మునగపాక, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణపాలన మళ్లీ కావాలంటే జగన్‌మోహనరెడ్డికి పట్టంకట్టాలని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. మునగపాక నం దీశ్వర ప్రాంగణం వద్ద ఆదివారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. అమర్‌నాథ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందన్నారు.

    జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరి న్ని సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు వెన్నుపొడిచిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదన్నారు. యలమంచిలి అసెం బ్లీ అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ స్థానికులకే పట్టం కట్టాలన్నారు. సమావేశంలో మునగపాక, అచ్చుతాపురం,రాంబిల్లి మండలాల కన్వీనర్లు మళ్ల సంజీవరావు, పల్లె శేషగిరిరావు, పిన్నమరాజు చంటిరాజు, పార్టీ నేత లు దాసరి అప్పారావు, కాండ్రేగుల నూకరాజు, దొడ్డి బాలాజీ, షేక్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.

    భారీ ర్యాలీతో హోరెత్తిన మునగపాక

    మునుపెన్నడూ లేని విధంగా బహిరంగ సభకు మండలంలోని వివిధ గ్రామాల వేలాది మంది పార్టీ నాయకులు,కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతకు ముందు పార్టీ కార్యాలయం నుంచి  పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా రిక్షా స్టాండ్, మెయిన్‌రోడ్డు మీదుగా నందీశ్వర ప్రాంగణం నుంచి పల్లపువీధి, సాంభశివుని ఆలయం, సంతబయలు, మధ్యవీధి, పంచాయతీ వీధి, గౌరమ్మ గుడి మీదుగా  సభా స్థలికి చేరుకున్నారు.

    ఈ ర్యాలీలో పార్టీ జెండాలు,కండువాలతో నాయకులు, కార్యకర్తలు జై జగన్..జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంసృ్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డప్పు వాయిద్యాలు, బాణసంచా కాల్పులతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ర్యాలీలో గుడివాడ అమర్‌నాథ్, బొడ్డేడ ప్రసాద్‌లు ప్రజలకు అభివాదం చెబుతూ సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మునగపాక మెయిన్‌రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు దానిని నియంత్రించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement