వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే వికలాంగులకు వెయ్యి రూపాయల పింఛన్‌ను ఇస్తారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి
పలాస రూరల్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే వికలాంగులకు వెయ్యి రూపాయల పింఛన్‌ను ఇస్తారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. పలాస పెద్దవీధిలో శనివారం ఆమె 17, 19వ వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేయనున్న బళ్ల ఉష, నాగరాణిపాత్రోకు మద్దతుగా ప్రచారం చేపట్టారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులకు ప్రస్తుతం అందజేస్తున్న రూ.200లు పింఛన్‌ను రూ. 700లకు పెంచుతామన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరిస్తామని, నిరుపేద రైతులకు ఎకరా భూమి పంపిణీ చేస్తామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రజలు దిక్కులేని స్థితిలో ఉంటే వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేశారని గుర్తు చేశారు.
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్‌ఆర్ సీపీ విజయం ఖాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, పలాస అసెంబ్లీ సమన్వయకర్త వజ్జ బాబూరావు, పట్టణ, మండల కన్వీనర్లు బళ్ల గిరిబాబు, కుప్పిలి కామరాజు,మాజీ కౌన్సిలర్ డబ్బీరు భవానీశంకర్, యవ్వారి మోహన్‌రావు, దుర్గాప్రసాద్‌పాత్రో, సాసుమాన చంద్రమౌళి, చింతాడ మాధవరావు పాల్గొన్నారు.